చింత చెట్టు నుండి కిందపడి వ్యక్తి మృతి

చింత చెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మరణించిన సంఘటన మేళ్లచెరువులో గురువారం వెలుగులోనికి వచ్చింది.

Update: 2024-05-23 13:45 GMT

దిశ, మేళ్లచెరువు : చింత చెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మరణించిన సంఘటన మేళ్లచెరువులో గురువారం వెలుగులోనికి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ఎస్కే హుస్సేన్ (40) మేళ్లచెరువులోని నాగుల చెరువు (చిన్న చెరువు) వద్ద గల చింత చెట్టు కు చింత చిగురు కోసుకునేందుకు చెట్టు ఎక్కినట్టు చెట్టు మీద ఎండుకొమ్మపై కాలు మోపటంతో కొమ్మ విరిగి కిందపడి మరణించాడు. మృతుడు స్థానిక సిమెంట్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు తెలిపారు.

Similar News