పాలవ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో పాల వ్యాన్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-05-25 15:42 GMT

దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో పాల వ్యాన్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నల్లగొండ వన్ టౌన్ ఎస్ ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండకు చెందిన మాదాని ఆంథోని (55) వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తున్నాడు. ఈయన సాయి నగర్ లో నివాసం ఉంటాడు. ఉదయం 9 గంటలకు బైక్​పైన పని నిమిత్తం నల్లగొండకు వస్తుండగా మార్గమధ్యలో మౌంట్ ఫోర్ట్ స్కూల్ ఎదురుగా అయితగోని మహేష్ పాల వ్యాన్ వచ్చి ఢీకొట్టడంతో ఆంటోనీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

Similar News