తెలంగాణలో సంచలన ఘటన.. రాష్ట్ర రాజధాని‌లో శ్రద్ధ తరహా మర్డర్ రిపీట్..!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ మర్డర్ దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-05-24 14:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ మర్డర్ దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియుడు ఆఫ్తాబ్ ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసి.. డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేసి పలు ప్రదేశాల్లో పడవేయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలో నివాసం ఉంటున్న నాగేంద్ర అనే వ్యక్తి తన భార్య మధులతను దారుణంగా హత్య చేశాడు. హత్యా అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కులు చేసే ప్రయత్నం చేసి తర్వాత ఇంట్లో గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని భర్త నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు. మధులత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు మధులత సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను ఇంత కిరాతకంగా హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News