నకిలీ పిస్టల్ తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన దంపతులు అరెస్ట్

నకిలీ పిస్టల్ తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖానాపురం హవేలి సీఐ భానుప్రకాశ్ తెలిపారు.

Update: 2024-05-07 14:42 GMT

దిశ, ఖమ్మం సిటీ : నకిలీ పిస్టల్ తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖానాపురం హవేలి సీఐ భానుప్రకాశ్ తెలిపారు. నగరంలోని కవిరాజ్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారిని ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నక్సలైట్లమని, అర్జెంటుగా లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వలేకపోతే చంపుతామని నకిలీ పిస్టల్ చూపించి బెదిరించారు. చివరకు రూ. 5 వేలు తీసుకొని వెళ్లిపోయారు. బాధితులు ఖమ్మం ఆర్బన్ పోలీస్ స్టేషన్ లో

    ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో శ్రీశ్రీ సర్కిల్ లో సోమవారం చేపట్టిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా తాము పల్లిపాడు గ్రామం కొణిజర్ల మండలానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు అలియా ఎస్వీ రెడ్డి, అతని భార్య రాయల శ్రీలతగా తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ వ్యాపారిని బెదిరించినట్లు ఒప్పుకున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలని నేర ప్రవృత్తిని ఎంచుకున్నారని, గతంలో 12 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి మూడు వేల నగదు, బొమ్మ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

Similar News