ట్రాక్టర్ ను ఢీకొన్న బైక్ ఒకరు దుర్మరణం

నవాబుపేట మండల కేంద్రం నుంచి మండల పరిధిలోని గురుకుంట గ్రామానికి వెళ్లే దారిలో శనివారం మోటార్ సైక్లిస్ట్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను అతి వేగంగా వెళ్లి ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

Update: 2024-05-18 13:01 GMT

దిశ, నవాబుపేట : నవాబుపేట మండల కేంద్రం నుంచి మండల పరిధిలోని గురుకుంట గ్రామానికి వెళ్లే దారిలో శనివారం మోటార్ సైక్లిస్ట్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను అతి వేగంగా వెళ్లి ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఏపీ 28 ఎహెచ్ 5077 నంబర్ గల మోటార్ సైకిల్ పై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి తన ముందు వెళ్తున్న కారును అతివేగంగా ఓవర్టేక్ చేసి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహం రక్తపు మడుగులో కూరుకుపోయింది. కుడి చేయి దేహం నుంచి విడిపోయి అల్లంత దూరాన పడింది. మృతుడు రాజాపూర్ మండల పరిధిలోని పరిసర గ్రామాలకు చెందిన వాడై ఉంటాడని భావిస్తున్నారు. సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News