గేమింగ్ జోన్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి.. యువరాజ్ సింగ్ అరెస్ట్

గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో టీపీఆర్ గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని 27 మంది సజీవ దహనం అయ్యారు.

Update: 2024-05-26 02:10 GMT

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో టీపీఆర్ గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని 27 మంది సజీవ దహనం అయ్యారు. శనివారం వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు సరదా కోసం పిల్లలను తీసుకుని ఈ గేమింగ్ జోన్ కు వచ్చారు. కాగా దాని నిర్వహకులు సరైన పద్దతులను ఉపయోగించకపోవడం, గేమింగ్ జోన్ కు సరిపడా స్థలం లేకపోవడంతో.. అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనుమతులు లేకుండా టీపీఆర్ గేమింగ్ జోన్ ను నిర్వహిస్తున్న యువరాజ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేశారు. అలాగే ఇందులో భాగస్వాములుగా కొనసాగుతున్న మరో పదిమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 27 మంది చనిపోగా.. ఇందులో 12 పిల్లలు, 4 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News