కడెం మండలంలో 14 క్వింటాళ్ల నల్ల బెల్లం, 68 కిలోల పటిక స్వాధీనం

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దోస్తునగర్ గ్రామంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు.

Update: 2024-05-08 13:41 GMT

దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దోస్తునగర్ గ్రామంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దోస్తునగర్ గ్రామంలోని ఓ కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరుకు అయిన 14 క్వింటాళ్ల నల్ల బెల్లం, 68 కిలోల పట్టికను స్వాధీనం చేసుకొని దుకాణ యజమాని పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా గుడుంబా తయారీ ముడి సరుకు అమ్మినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో జిల్లా, మండల ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News