ఏయూకి 36వ ర్యాంక్

దిశ ఏపీ బ్యూరో: ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 36వ స్థానంలో నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యూనివర్సిటీల విభాగంలో ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది. నెంబర్ వన్‌గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. రెండో స్థానంలో జేఎన్‌యూ, మూడవ స్థానంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ నిలవగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కింది. కేఎల్ యూనివర్సిటీ 70వ స్థానంలో […]

Update: 2020-06-11 10:51 GMT

దిశ ఏపీ బ్యూరో: ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 36వ స్థానంలో నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యూనివర్సిటీల విభాగంలో ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది. నెంబర్ వన్‌గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. రెండో స్థానంలో జేఎన్‌యూ, మూడవ స్థానంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ నిలవగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కింది. కేఎల్ యూనివర్సిటీ 70వ స్థానంలో నిలిచింది. ఇక, ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది కూడా నెంబర్ వన్‌గా నిలిచి ఐఐటీ మద్రాస్‌కు ఎదురులేదని నిరూపించింది. ఐఐటీ హైదరాబాదు ఈ జాబితాలో 17వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

Tags:    

Similar News