ఫారూక్‌నగర్‌లో 3వేల లీటర్ల కల్తీకల్లు సీజ్

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫారూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కల్తీకల్లు తయారీ కేంద్రం‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్లు తయారీకి అవసరమైన క్లోరోఫామ్ రసాయనం, ఇతర మత్తు పదార్థాలతో పాటు దాదాపు 3వేల లీటర్ల కల్తీకల్లును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వి.సురేందర్ మాట్లాడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా కల్తీకల్లును తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డీసీపీ రీతిరాజ్, ఎస్సై క‌ృష్ణ పాల్గొన్నారు. […]

Update: 2020-04-19 01:20 GMT

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫారూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కల్తీకల్లు తయారీ కేంద్రం‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్లు తయారీకి అవసరమైన క్లోరోఫామ్ రసాయనం, ఇతర మత్తు పదార్థాలతో పాటు దాదాపు 3వేల లీటర్ల కల్తీకల్లును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వి.సురేందర్ మాట్లాడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా కల్తీకల్లును తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డీసీపీ రీతిరాజ్, ఎస్సై క‌ృష్ణ పాల్గొన్నారు.

Tags: kalthi kallu, seize, rangareddy, crime news

Tags:    

Similar News