ఫ్లోరిడాలో మరోసారి పేలిన తుపాకీ.. చిన్నారితో సహా ముగ్గురు మృతి

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా లో మరోసారి తుపాకీ పేలింది.  గురువారం ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం రేపాయి. ఒక గుర్తు తెలియని దుండగుడు రాయల్ పామ్ బీచ్ లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులను కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో దుండగుడితో పాటు ఒక చిన్నారి, మరో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక మహిళ, […]

Update: 2021-06-10 23:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా లో మరోసారి తుపాకీ పేలింది. గురువారం ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం రేపాయి. ఒక గుర్తు తెలియని దుండగుడు రాయల్ పామ్ బీచ్ లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులను కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో దుండగుడితో పాటు ఒక చిన్నారి, మరో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక మహిళ, చిన్నారి తో సహా షూటర్ కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులకు గల కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉందని , ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News