రెండో రోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి సభలో సంతాపం తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు శాఖల డిమాండ్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు మండలి చైర్మన్ అధ్యక్షతన మొదలయ్యాయి. ముందుగా భారత్, చైనా సరిహద్దుల్లో అమరులైన […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి సభలో సంతాపం తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు శాఖల డిమాండ్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు శాసనమండలి సమావేశాలు మండలి చైర్మన్ అధ్యక్షతన మొదలయ్యాయి. ముందుగా భారత్, చైనా సరిహద్దుల్లో అమరులైన వీరజవాన్లకు సంతాపం తీర్మానం తెలుపుదామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. అయితే, సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. మొదట బడ్జెట్‌పై చర్చ మొదలుపెట్టి ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని పేర్కొన్నారు.