ICC World Cup 2023: హార్దిక్ పాండ్యా గాయంపై అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ

Update: 2023-10-19 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కాలి మడమకు గాయమైన విషయం తెలిసిందే. తాజాగా హార్దిక్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతని గాయన్ని అంచనా వేసేందుకు స్కానింగ్ కోసం తీసుకెళ్లామని పేర్కొంది. గాయపడిన తర్వాత హార్దిక్ నడిచేందకు ఇబ్బండిపడ్డాడు.

ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్‌లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తూ కాలి గాయానికి లోన‌య్యాడు. అత‌ని తొడ కండ‌రాల ప‌ట్టేసిన‌ట్లు తెలుస్తోంది. బంగ్లా బ్యాట‌ర్ లింట‌న్ దాస్ వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు కొట్టాడు. ఆ త‌ర్వాత బంతికే హార్దిక్ గాయ‌ప‌డ్డాడు. జ‌ట్టు ఫిజియో మైదానంలోకి వ‌చ్చి హార్దిక్‌ను తీసుకెళ్లాడు. అయితే మిగితా మూడు బంతుల్ని విరాట్ కోహ్లీ బౌల్ చేశాడు.

Tags:    

Similar News