కరోనా.. 24 గంటల్లో 194 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రతి రోజు 6 వేల పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గడిచిన 24 గంటల్లో 6,566 కేసులు నమోదు కాగా, 194 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులను కలుపుకుంటే మొత్తం బాధితుల […]

Update: 2020-05-27 22:56 GMT

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రతి రోజు 6 వేల పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గడిచిన 24 గంటల్లో 6,566 కేసులు నమోదు కాగా, 194 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులను కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 1,58,333కు చేరింది. ఇక మొత్తం మృత్యుల సంఖ్య 4,531కి చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 67,692 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 86,110 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుత కరోనా కేసుల నమోదుతో భారత్ ప్రపంచంలో అత్యంత ప్రభావితమవుతున్న పదో దేశంగా అవతరించింది.

Tags:    

Similar News