SRR కాలేజీ చుట్టూ 144 సెక్షన్ అమలు.. కౌంటింగ్ పూర్తయ్యే వరకు!

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉపఎన్నికల హడావుడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ చూపు మొత్తం హుజురాబాద్ ఉపఎన్నికల మీద ఉంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తు్న్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎస్ఆర్ఆర్ కాలేజీ చుట్టూ 200 మీటర్ల పరిధిలో అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటల నుంచి నవంబర్ 02 ఎన్నికల ఫలితాలు పూర్తిగా […]

Update: 2021-10-26 10:49 GMT

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉపఎన్నికల హడావుడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ చూపు మొత్తం హుజురాబాద్ ఉపఎన్నికల మీద ఉంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తు్న్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

దీంతో ఎస్ఆర్ఆర్ కాలేజీ చుట్టూ 200 మీటర్ల పరిధిలో అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటల నుంచి నవంబర్ 02 ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆనంద్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి, పోలీస్ బందోబస్తు విధుల్లో ఉన్న వారికి ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టంచేశారు.

Tags:    

Similar News