కృష్ణమ్మ ఉగ్రరూపం.. చిక్కుకున్న 132లారీలు
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. అయితే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో 132 లారీలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. ఈ ఘటన జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద చోటు చేసుకుంది. దీంతో లారీ యజమానులు, స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్లు, […]
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. అయితే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో 132 లారీలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. ఈ ఘటన జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద చోటు చేసుకుంది. దీంతో లారీ యజమానులు, స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పడవల్లో ఒడ్డుకు తీసుకువచ్చారు. లారీలను కూడా ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇసుకకోసం వెళ్లగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.