తిరుపతిలో అర్చకులను వెంటాడుతోన్న కరోనా..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. రోజుకు 2వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్న కరోనా కేసులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్ ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే తిరుపతి ఆలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా 12 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తిరుమలలోని ఉద్యోగులకు టీటీడీ వ్యాక్సినేషన్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. రోజుకు 2వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్న కరోనా కేసులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్ ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే తిరుపతి ఆలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా 12 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో తిరుమలలోని ఉద్యోగులకు టీటీడీ వ్యాక్సినేషన్ వేయిస్తోంది. ఇప్పటివరకు 4వేల మంది ఉద్యోగులకు టీకా వేయించినట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే తిరుపతిలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా, తిరుపతిలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా 12వ తేదీ నుంచి సర్వదర్శనాన్ని నిలిపివేయనున్నట్లు టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే.