ఆ శిఖరాన్ని ఎక్కిన పదో తరగతి విద్యార్థి

దిశ, ఎల్లారెడ్డి: గిరిజన స్టూడెంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ స్కూల్ తండాకు చెందిన విస్లావత్ బన్ని శుక్రవారం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపాల్ సభావత్ కిషన్ నాయక్ తెలిపారు. నాగిరెడ్డిపేట్ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బన్ని ఈ నెల 19న ఆఫ్రికాకు వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బన్ని […]

Update: 2021-03-26 08:50 GMT

దిశ, ఎల్లారెడ్డి: గిరిజన స్టూడెంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్ స్కూల్ తండాకు చెందిన విస్లావత్ బన్ని శుక్రవారం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపాల్ సభావత్ కిషన్ నాయక్ తెలిపారు. నాగిరెడ్డిపేట్ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బన్ని ఈ నెల 19న ఆఫ్రికాకు వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బన్ని మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ సహకారంతో శిఖరాన్ని అధిరోహించినట్లు తెలిపాడు. రూ.3లక్షలను టూరిజం శాఖతో ఎమ్మెల్యే మాట్లాడి, ఆఫ్రికాకు పంపారన్నారు. పర్వతం విజయవంతం అనంతరం విద్యార్థి బన్ని శిఖరంపై సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సురేందర్, రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల సెక్రటరీ ఫొటోలను ప్రదర్శించాడు. కాగా, బన్నిని ఎమ్మెల్యే సురేందర్ అభినందించారు.

Tags:    

Similar News