వ్యాక్సినేషన్‌లో రికార్డ్.. ప్రసంగంలో కొత్త నినాదమిచ్చిన మోడీ.. ఏమన్నారంటే.?

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో అక్టోబర్ 21వ తేదీ నాటికి దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందించినట్టు తెలిపారు. ఇది భారతీయులు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా భారత విజయాన్ని కొనియాడారు. దేశ ప్రజల కార్య దీక్ష వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. భారత్ […]

Update: 2021-10-21 23:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో అక్టోబర్ 21వ తేదీ నాటికి దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందించినట్టు తెలిపారు. ఇది భారతీయులు గర్వించదగ్గ విషయమని అన్నారు.

ఈ సందర్భంగా భారత విజయాన్ని కొనియాడారు. దేశ ప్రజల కార్య దీక్ష వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. భారత్ సాధించిన ఘనత వల్ల ప్రపంచ దేశాలు మన వైపే చూస్తున్నాయని, దేశాన్ని పొడుగుతున్నాయని అన్నారు. కొవిడ్ మహమ్మారిని మనం విజయవంతంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా వ్యాక్సిన్ మన నినాదమని మోడీ వెల్లడించారు.

Tags:    

Similar News