నల్గొండ జిల్లా ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. గురువారం రాత్రి అంగడిపేట పేట వద్ద కూలీల ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. బాధిత కుటుంబాలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే […]

Update: 2021-01-22 00:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. గురువారం రాత్రి అంగడిపేట పేట వద్ద కూలీల ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. బాధిత కుటుంబాలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాయక్, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.

Tags:    

Similar News