“సుక్కాపొద్దు నిద్రలేసే తెలంగాణానే” పాటకు ప్రశంసా పత్రం

22

దిశ, పరకాల: తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ‘బతుకమ్మ ఫిల్మోత్సవం 2021’ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్లో కాళోజీ టివి ఆధ్వర్యంలో చిత్రీకరించిన “సుక్కాపొద్దు నిద్రలేసే తెలంగాణానే” పాటను ప్రదర్శించారు. చక్కని పాటను చిత్రీకరించినందుకు యాజమాన్యాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజ్, సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందించి దర్శకులు అమ్మ వేణుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ వేణు మాట్లాడుతూ ఇలాంటి ప్రోత్సాహకాలు కొత్తగా వచ్చే ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులు మరింత ఉత్సాహంతో ముందుకు రావడానికి ఆస్కారం ఉందని తెలిపారు. ఈ పాటకు లిరిక్స్ అందించిన గట్టు రాధికా మోహన్, మ్యూజిక్ నవీన్ సాంబరీ, సింగర్స్ పద్మావతి, లావణ్య, రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..