ఆ ఆలయం నుంచే అమిత్‌ షా ప్రచారం.. ఎందుకంటే?

by  |
ఆ ఆలయం నుంచే అమిత్‌ షా ప్రచారం.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను రంగంలోకి దించింది. నగరం నలువైపులా రోడ్‌షోలతో నిర్వహిస్తున్నది. ఎవరి ఎన్ని ప్రచారాలు చేసినా చార్మినార్ దగ్గర ఉన్న ‘భాగ్యలక్ష్మీ ఆలయం’ చుట్టు ఎన్నికలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒట్లతో ఎన్నికల తెరమీదికి ఆ ప్రాచీన ఆలయాన్ని తెర మీదికి తీసుకువచ్చారు. అదే భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన తర్వాతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

‘భాగ్యనగర్’ సెంటిమెంట్ కోసమేనా..

బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అక్కడ నగరాలు, ఊర్ల పేర్లను మార్చడం రివాజుగా పెట్టుకుంది. ఈ పేర్ల మార్పు వెనుక మతపరమైన పోలరైజేషన్ కూడా ఉన్నది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను జీహెచ్‌ఎంసీలో రగల్చే పనిని పెట్టుకున్నది. అందుకే.. భాగ్యలక్ష్మి ఆలయాన్ని తెరమీదికి తీసుకువచ్చింది. వరద సహాయం ఎవరు ఆపారు? అనే చర్చ నుంచి ఎన్నికల్లోకి భాగ్యలక్ష్మి ఆలయం వచ్చింది. సంచలన వ్యాఖ్యలతో ఎన్నికలను హీటెక్కించిన బండి సంజయ్ ఇందుకు ఆజ్యం పోయగా.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ విషయం జనాల్లో ఉండాలనే ఉద్దేశంతో అమిత్ షా భాగ్యలక్ష్మి ఆలయ సందర్శనను షెడ్యూల్‌లో పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. భాగ్యలక్షి ఆలయం సందర్శన తర్వాత అమిత్ షా… సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లిహీల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.

Next Story