అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన అంబులెన్స్ 

by  |
అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన అంబులెన్స్ 
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామపంచాయతీ సత్యనారాయణపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అమ్మానాన్న వృద్ధుల అనాధ ఆశ్రమం వద్ద పాలకొల్లు నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా పాడేరుకు చెందిన గ్రంధి రంగ నాయకుడుగా గుర్తించారు. అతని భార్య అన్నపూర్ణ(60)తోపాటు అంబులెన్స్ డ్రైవర్ షేక్ సాహెబ్, మరో అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే బంధువులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed