ఓహో.. ఓటిటి సినిమా

by  |
ఓహో.. ఓటిటి సినిమా
X

సినీ జగత్తులో సరి కొత్త శకం మొదలు కాబోతోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ ప్రయోగానికి వేదిక కానుంది. సినిమా అనే ఒక ఆర్ట్ మొదలైనప్పటి నుంచి ఎన్నో మార్పులు చూశాం.. బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన్ కలర్, కలర్, అంటూ ఎన్నో మార్పులు చూశాం. అన్ని చిత్రాలు సినిమా హాల్స్ లోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు చిత్ర విడుదలలో భారీ మార్పు చూడబోతున్నాం. సినిమా రిలీజ్ అంటే అభిమాన నటుల కట్ ఔట్ లు, పాలాభిషేకాలు, సినిమా హాల్స్ లో విజిల్స్, డ్యాన్స్ లు, బొమ్మ తెరపై పడగానే పేపర్ ఎగరడాలు.. సింపుల్ గా సినిమా విడుదల అంటే అభిమానులకు ఒక పండుగ. కానీ అన్ని పండుగలకు అప్ డేట్ అద్దినట్లే.. ఈ పండగ కూడా ఇక న్యూ వెర్షన్ తో మన ముందుకు రాబోతోంది. కానీ ఇంత హడావిడి ఉండదు.. ఇన్ని సెలబ్రేషన్స్ ఉండవ్. మొబైల్ చేతిలో పట్టుకుని.. లేదా టీవీ పెట్టుకుని.. మనకు నచ్చిన రీతిలో సినిమా చూడొచ్చు. ఈ బిజీ లైఫ్ లో సినిమా హాళ్లకు వెళ్లే టైమ్ లేని వారికి.. ఇది నిజంగా గుడ్ న్యూస్ అయినా.. సినిమా అంటే థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి కొంచెం నిరాశ కలిగించే విషయమే. కరోనా ఎఫెక్ట్ దీనికి కారణం కాగా.. ఈ టైమ్ లో ఇలాంటి పరిణామం శుభపరిణామమే అని చెప్పేవాళ్లు కూడా లేకపోలేదు.

కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది. సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో కష్టపడి తీసిన చిత్రం విడుదల ఆగిపోయి నిర్మాతలు దిక్కుతోచని స్థితిలో పడేలా చేసింది. ఇప్పట్లో సినిమా విడుదలైన జనాలు హాల్స్, మాల్స్ కు వచ్చి చూసే పరిస్థితులు కనబడట్లేదు. దీంతో నిర్మాతలు ఓటిటి వైపు మొగ్గు చూపారు. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అమెజాన్ ప్రైమ్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. వచ్చే మూడు నెలల్లో ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. థియాట్రికల్ రిలీజ్ కు స్వస్తి చెప్తూ.. ఓటిటిలో సినిమాను రిలీజ్ చేస్తున్న తొలి ప్లాట్ ఫామ్ గా అమెజాన్ ప్రైమ్ రికార్డ్ సృష్టించింది. భారతదేశంలోని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలను విడుదల చేస్తోంది.

1. పోన్ మగల్ వందల్( తమిళ్) – మే 29
జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన పోన్ మగల్ వందల్ తమిళ్ సినిమా భారత్ లో తొలి ఓటిటి రిలీజ్ మూవీ కాబోతోంది. ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త హీరో సూర్య నిర్మించగా జె.జె. ఫెడ్రిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జ్యోతిక లాయర్ గా కనిపించనున్నారు. మే 29న సినీ ప్రపంచంలో సరి కొత్త ప్రయోగానికి తెరతీస్తూ విడుదల కాబోతోంది.

2. గులబో సితబో( హిందీ) – జూన్ 12
ఓటిటిలో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ హిందీ ఫిల్మ్ గులబో సితబో. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా లో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా నా 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మార్పులు చూసిన నేను.. ఈ మార్పుకు కూడా శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని తెలిపారు బిగ్ బి.

3. పెంగ్విన్(తెలుగు, తమిళ్, కన్నడ)- జూన్ 19
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నుంచి మహానటి తర్వాత వస్తున్న సినిమా పెంగ్విన్. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. కాగా ఓటిటి లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.

4. లా( కన్నడ) – జూన్ 26
రాగిణి ప్రజ్వాల్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం లా. సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను పిఆర్కే ప్రొడక్షన్స్ బ్యానర్ లో హీరో పునీత్ రాజ్ కుమార్ నిర్మించారు. రఘు సమర్త్ దర్శకుడు.

5. ఫ్రెంచ్ బిర్యాని ( కన్నడ) – జూలై 24

కన్నడ చిత్రం ఫ్రెంచ్ బిర్యాని జూలై 24న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న చిత్రం. దనిష్ సైతు లో కామెడీ ఆంగిల్ చూపించబోతున్న సినిమాకు పన్నాగ భరణ దర్శకులు. పీఆర్కే ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా రూపుదిద్దుకుంది. అవినాష్ బలెక్కల రచయిత.

6. శకుంతలా దేవి ( హిందీ)
విద్యాబాలన్ టైటిల్ రోల్ చేస్తున్న శకుంతలా దేవి సినిమాను సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ప్రొడక్షన్స్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అను మీనన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవిగా ప్రేక్షకులను అలరించనుంది విద్య. కాగా సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనుంది అమెజాన్ ప్రైమ్.

7. సుఫియుమ్ సుజతయుమ్ ( మలయాళం)
జయసూర్య, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం సుఫియుమ్ సుజతయుమ్. ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకు నరనిఫుజ శనవస్ దర్శకుడు. విజయ్ బాబు నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ఫిక్స్ చేయనున్నారు.



Next Story

Most Viewed