బన్నీ‌‌@18

by  |
బన్నీ‌‌@18
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్ట్రైలిష్ స్టార్‌గా బిరుదు సంపాదించుకున్న అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేరళలో కూడా బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ అనగానే గుర్తుకొచ్చేది స్ట్రైల్, డ్యాన్స్. తనకంటూ ప్రత్యేకమైన స్ట్రైల్‌తో పాటు డ్యాన్సులతో టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.

నేటికి అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరిగ్గా 18 ఏళ్లు అయింది. ఈ విషయాన్న అల్లు అర్జున్ తన ట్విట్టర్‌లో తెలిపాడు. ‘నా తొలి సినిమా విడుదలై నేటికి 18 సంవత్సరాలు అయింది. నా ఈ 18 సంత్సరాల ప్రయాణంలో భాగమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నాపై చూపించిన ప్రేమను నిజంగా ఆశీర్వదించాను. అన్ని ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

18 సంత్సరాలు అయిన సందర్భంగా అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

2003లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా అల్లు అర్జున్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఏడాది మార్చి 28న గంగోత్రి సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. అంటే నేటికి సరిగ్గా 18 ఏళ్లు అయింది. మంచి ప్రేమ కథతో రూపుదిద్దుకున్న ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆర్య సినిమా కూడా హిట్ కావడంతో.. టాలీవుడ్‌లో హీరోగా బన్నీ నిలదొక్కుకున్నాడు. అంతకుముందు చిన్న వయస్సుల్లోనే చిరంజీవి హీరోగా వచ్చిన విజేత, డాడీ సినిమాలతో పాటు కమల్‌హాసన్ స్వాతిముత్యం సినిమాల్లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.



Next Story

Most Viewed