పాఠశాల విద్యా డైరెక్టర్‌పై అవినీతి ఆరోపణలు

by  |
పాఠశాల విద్యా డైరెక్టర్‌పై అవినీతి ఆరోపణలు
X

దిశ,వెబ్‌డెస్క్ : పాఠశాల విద్యా డైరెక్టర్ చిన వీరభద్రుని చుట్టు ఉచ్ఛు బిగిస్తోంది. ఆయన ఐటీడీఏ పీఓగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలను తెర మీదకు తీసుకొస్తున్నారు బాధితులు. 2001లో ఐటీడీఏ శ్రీశైలంలో నిధులు గోల్‌మాల్ చేశారంటూ విజిలెన్స్ నివేదికనిచ్చింది. వీరభద్రడు ఐటీడీఏ పీఓగా ఉన్న రోజుల్లో సర్కార్ సొమ్మును స్వాహా చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా దండుకుని శ్రీశైలం ఐటీడీఏలో కొందరికి ఉద్యోగాలు ఇప్పించినట్లు అభియోగం. చిన వీరభద్రుడి అవినీతిని విచారణ అధికారి విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు. వీరభద్రుడి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం గమనర్హం. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులతో లాబీయింగ్ జరిపిన వీరభద్రడు ఐఏఎస్‌గా ప్రమోట్ చేయండంతో విజిలెన్స్ నివేదిక పెండింగ్‌లో ఉండగా ఐఏఎస్‌గా ఎలా ప్రమోట్ చేశారంటూ వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన అక్రమాలపై తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed