శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీల నెల జీతం విరాళం

by  |
శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీల నెల జీతం విరాళం
X

ముంబయి : తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరి నెల జీతం కరోనా కట్టడి కోసం విరాళంగా అందజేయబోతున్నట్టు ప్రకటించి శివసేన అన్ని పార్టీలకు ఆదర్శంగా నిలిచింది. శివసేన పార్టీ ఎమ్మెల్యే ఎంపీలందరూ తమ నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయనున్నారని శుక్రవారం.. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు సెలబ్రిటీలు, కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. కానీ ఒక రాజకీయ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఎంపీల అందరి నెల జీతం విరాళంగా అందజేస్తున్నట్టు ప్రకటించడం ఇదే తొలిసారి.

130కి పైనే కరోనా కేసులు నమోదైన మహారాష్ట్ర… ఈ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతోంది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ సహా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి కరోనా బాధితుల కోసం తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అనంతరం రాజ్ భవన్ సిబ్బందినీ ఒకరోజు వేతనం.. సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేయాలని కోరారు. ఈ సందర్భంలోనే శివసేన తాజా ప్రకటన చేసింది.

Tags: Coronavirus, contain, maharastra, shivsena, CMRF, donate



Next Story

Most Viewed