మ్యావ్ టాక్ @పిల్లి కూతలకు అర్థం చెప్పే యాప్

by  |
మ్యావ్ టాక్ @పిల్లి కూతలకు అర్థం చెప్పే యాప్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోని మోస్ట్‌ పాపులర్ పెట్స్‌లో పిల్లి కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే మనిషి.. పిల్లులతో స్నేహం చేస్తున్నాడు. అయితే ఇండియాలో ‘పిల్లి’ని ఎంతోమంది అపశకునంగా భావిస్తారు. కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం పిల్లుల్ని ప్రేమగా, ఇష్టంగా పెంచుకుంటారు. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. కాగా మరే జంతువుకు లేని ఒక ప్రత్యేకత పిల్లికి మాత్రమే సొంతం. అదేంటంటే.. అవి వంద రకాలుగా అరవగలవు. అందుకే పిల్లి ‘మ్యావ్ లాంగ్వేజ్’ను అనువదించే ట్రాన్స్‌లేషన్ యాప్ వచ్చేసింది. మాజీ అమెజాన్ అలెక్సా ఇంజనీర్ దీన్ని అభివృద్ధి చేశాడు.

కింద పడ్డవాడు ‘అమ్మ’ అని ఒకలా అరిస్తే, ఆకలితో ఉన్నవాడు ‘అమ్మా’ అని మరో విధంగా పిలుస్తాడని ఏదో సినిమాలో అన్నట్లుగా.. పిల్లులు కూడా అందులో తక్కువేం కాదు. అందుకేనేమో ‘పిల్లి కూతలు’ కూయకని అంటుంటారు. చాలా వరకు జంతువులు మనుషుల్లానే సంతోషం, కోపం, బాధను ప్రదర్శిస్తాయి. ఆయా భావాలకు తగినట్లే ధ్వనులు చేస్తాయి. పిల్లులు కూడా అంతే! వాటి భాషలో మనతో మాట్లాడుతుంటాయి. అందుకే పిల్లి ధ్వనుల్ని అర్థం చేసుకునేందుకు గాను అమెజాన్ అలెక్సాలో గతంలో ఇంజినీర్‌గా చేసిన అక్వెలన్.. ‘మ్యావ్ టాక్’ పేరుతో ఓ యాప్ తయారుచేశాడు. అయితే ఏ రెండు పిల్లుల ‘మ్యావ్’ శబ్దం ఒకలా ఉండదు. అందుకే అక్వెలన్ జనరిక్ డేటా బేస్ కాకుండా, భిన్నమైన డేటాబేస్‌తో యాప్ రూపొందించడం విశేషం. ఈ యాప్ ద్వారా పిల్లి అరిచిన ప్రతిసారి.. దాని భాషకు మనం అర్థం తెలుసుకోవచ్చు.

మ్యావ్‌టాక్ (MeowTalk) గూగుల్ ప్లే స్టోర్‌, ఆపిల్ యాప్ స్టోర్ అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో లభిస్తోంది. పిల్లి మాట్లాడేటప్పుడు ఈ యాప్ ఆన్ చేస్తే, అందులో ఆ పిల్లి కూతలు రికార్డ్ అవుతాయి, వెంటనే సదరు యాప్ వాటిని ట్రాన్స్‌లేట్ చేసి చూపుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతోనే ఈ యాప్ పిల్లి భాషను గుర్తిస్తోంది ఈ యాప్. ‘నాకు ఆకలి వేస్తోంది, కోపంగా ఉన్నాను, నన్ను ఒంటరిగా వదిలేయండి’ వంటి 13 రకాల అర్థాలను ప్రస్తుతానికి ఇందులో ఉంచారు. పిల్లులకు అసలు భాషే లేదని పరిశోధకులు అంటుండగా, తరచూ పిల్లి చేసే ధ్వనులను యాప్‌లో రికార్డ్ చేస్తే కొన్ని రోజులకు పూర్తిస్థాయిలో మీనింగ్‌ని యాప్ గుర్తించగలదని యాప్ నిర్వాహకులు అంటున్నారు. యాప్ ఎంత ఎక్కువగా వాడితే పిల్లి భాషను అంతలా గుర్తించగలదని చెబుతున్నారు. ఈ యాప్ వల్ల క్యాట్ యజమానులు, తమ పిల్లి తమతో ఏం చెబుతుందో తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని, పిల్లుల ఇంటెన్షన్ ఏంటో తెలుస్తుందని, ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగే అవకాశముందని ఇల్వెనిక్ తెలిపాడు. ఈ యాప్ ఎవరికీ ఏ నష్టాన్ని కలిగించదని, మీ పిల్లితో మీరు ఫన్‌గా గడపవచ్చని ఆయన అన్నాడు.


Next Story