దేవుడి ప్రసాదమంటూ యంగ్ బ్యూటీకి అది తినిపించిన స్టార్ హీరో

53
sara ali khan

దిశ, సినిమా: అక్షయ్‌ కుమార్‌, సారా అలీ ఖాన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరి ‘అత్రంగి రే’. కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హిందీ టాక్‌ షో ‘ది కపిల్‌ శర్మ షో’లో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుంది సారా. అక్షయ్‌‌తో కలిసి షోకు హాజరుకాగా.. తనపై పెద్ద ట్రిక్‌ ప్లే చేశాడని చెప్పింది. ‘అక్షయ్ సార్ నాకు స్వీట్ అని చెప్పి వెల్లుల్లి తినిపించారు. అది కూడా దేవుడి ప్రసాదం అని నమ్మించి చేతిలో పెట్టాడు. అది ఉడికించినది కూడా కాదు. పూర్తిగా పచ్చిది’ అని తెలిపింది. అయితే ఈ ఘటనతో బాధపడ్డావా అని అక్షయ్ అడిగాడని, నిజంగా తింటే నీ కెరియర్‌పై ప్రామిస్ చేయాలన్నాడని వివరించింది. దీంతో తను గట్టిగా నవ్వడంతో తినలేదనే విషయం తెలిసిపోయిందని చెప్పింది సారా.