కశ్మీర్‌‌ పాఠశాలకు అక్షయ్ కోటి రూపాయల విరాళం

by  |
కశ్మీర్‌‌ పాఠశాలకు అక్షయ్ కోటి రూపాయల విరాళం
X

దిశ, సినిమా : ప్రక‌ృతి విపత్తులతో పాటు పాండమిక్ టైమ్‌లో అక్షయ్ కుమార్ హెల్పింగ్ హ్యాండ్ గురించి తెలియంది కాదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే అక్షయ్.. తనవంతు సాయంగా కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు కశ్మీర్‌లోని ఓ పాఠశాల పున:నిర్మాణానికి రూ.1 Cr డొనేట్ చేస్తానని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. జూన్ 17న జమ్ము కశ్మీర్‌లో ఉన్న అక్షయ్.. ఆ రోజంతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తోనే గడిపాడు. ఈ క్రమంలోనే స్థానిక పాఠశాల శిథిలావస్థకు చేరడాన్ని గమనించి, రీకన్‌స్ట్రక్షన్‌కు కంట్రిబ్యూట్ చేస్తానని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే మంగళవారం స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ఆ ఫొటోను బీఎస్ఎఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వర్చువల్‌ సెర్మనీకి అక్షయ్ కూడా హాజరయ్యారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన బీఎస్ఎఫ్.. ‘శ్రీమతి అను ఆస్థానా, ప్రెసిడెంట్ BWWA & శ్రీ సురేంద్ర పన్వార్, SDG వెస్టర్న్ కమాండ్ BSF సమక్షంలో వెబ్‌లింక్ ద్వారా పద్మశ్రీ అక్షయ్ కుమార్, DG BSF శ్రీ రాకేష్ ఆస్థానాతో నేడు గవర్నమెంట్ మిడిల్ స్కూల్ నిరు, కశ్మీర్‌ వద్ద హరి ఓం భాటియా ఎడ్యుకేషన్ బ్లాక్ శంకుస్థాపన’ అంటూ ఫొటోలు షేర్ చేసింది.

Next Story