ఆ సంస్థ ఉద్యోగులకు 5 ఏళ్లు సెలవులు..

by  |
ఆ సంస్థ ఉద్యోగులకు 5 ఏళ్లు సెలవులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా సంచలన నిర్ణయం తీసుకుంది. కొందరు ఉద్యోగులను ఐదేండ్ల పాటు జీతం లేకుండా తప్పనిసరి సెలవు పై పంపనుంది. ఉద్యోగుల సామర్థ్యం, వయసు, ఆరోగ్యం, ఇతరత్రా అంశాలను బేరీజు వేసుకుని ఎవరెవరినీ తప్పనిసరి సెలవు పై పంపాలో లిస్ట్ రెడీ చేయనుంది. ఈ మేరకు జూలై 14న ఆర్డర్ జారీ అయింది. ఈ ఆర్డర్‌లో ఎయిరిండియా సీఎండీ రాజీవ్ భన్సాల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు సూచనలు చేశారు. కనీసం ఆరు నెలలు, లేదా రెండేళ్లు అత్యధికంగా ఐదేళ్ల వరకు కూడా జీతం లేని సెలవు పై పంపడానికి జాబితాను పంపాలన్నారు. కరోనా వైరస్ కారణంగా విమానయాన రంగం భారీగా కుదేలైంది. ఇప్పటికే గోఎయిర్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులను ఏప్రిల్ నుంచి తప్పనిసరి సెలవుపై పంపింది.



Next Story

Most Viewed