నియమించిన ఉద్యోగాలకన్నా తొలగించినవే ఎక్కువ

by  |
నియమించిన ఉద్యోగాలకన్నా తొలగించినవే ఎక్కువ
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత లేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల అంశంపై ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వం ఉందని, పీఆర్సీ, ఐఆర్ ఇవ్వడం లేదని, డీఏ రాలేదని, సీపీఎస్ రద్దు కాలేదని ఆరోపించారు. నియమించిన ఉద్యోగాలకన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయని, లంచాలిస్తేనే అంతర్రాష్ట్ర బదిలీలు జరుగుతున్నాయన్నారు.

ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు సమావేశమై జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియ 2నెలల్లో పూర్తి చేయాలన్నారు. సీఎం సానుకూల నిర్ణయం తీసుకొని పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర బదిలీలను చేపట్టి ఉద్యోగస్తులకు మేలు చేయాలన్నారు. ప్రస్తుతం కొవిడ్-19 పరిస్థితుల్లో భార్య భర్తలు వేర్వురు రాష్ట్రాల్లో పనిచేస్తూ మనోవేదన చెందుతున్నారన్నారు. ఇరు రాష్ట్రాల నుంచి ఎన్‌వోసీలు పొందిన వారందరినీ, గడువు పెంపుతో సంబంధం లేకుండా వెంటనే బదిలీ జీఓలు జారీ చేయాలని, సర్వీస్ నష్టపోకుండా న్యాయం చేయాలని లేఖలో కోరారు.

Next Story

Most Viewed