1,300 మంది బ్యాంకు ఉద్యోగులు మృతి..

by  |
1,300 మంది బ్యాంకు ఉద్యోగులు మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా బ్యాంకింగ్ రంగంలో సుమారు 1,300 మంది బ్యాంకు సిబ్బంది మరణించినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈ) తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1,300 మంది బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, ఈ నేపథ్యంలో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యత కల్పిస్తూ వెంటనే కరోనా టీకా ఇవ్వాలని దేశీయ బ్యాంకుల సంఘం సీఈఓ సునీల్ మెహతాకు ఏఐబీఈ ప్రధాన కార్యదర్శి సీ హెచ్ వెంకటాచలం లేఖ రాశారు.

‘బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి తక్షణమే టీకా అందించాలని తాము చేసిన అభ్యర్థనలను ప్రభుత్వం అలసత్వం చేసిందని, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలను కలిగి ఉండే బ్యాంకు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేశారని ఏఐబీఈ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ పరిణామాలతో బ్యాంకు ఉద్యోగులు విధుల్లో పాల్గొనేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సి హెచ్ వెంకటాచలం తన లేఖలో తెలిపారు.

Next Story