సచిన్ తొలి సెంచరీకి 30 ఏళ్లు

by  |
సచిన్ తొలి సెంచరీకి 30 ఏళ్లు
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Cricket legend Sachin Tendulkar) తన కెరీర్‌లో తొలి శతకం (First century) చేసి ఆగస్టు 14నాటికి 30 ఏళ్లు గడిచింది. 1990లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి అంతర్జాతీయ శతకం (First international century) సాధించాడు.

అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు. తన తొలి సెంచరీకి 30ఏళ్లు పూర్తయిన సందర్భంగా సచిన్ ట్విట్టర్‌ (Twitter)లో ఒక వీడియోను పంచుకున్నాడు. ‘నా మొదటి సెంచరీ అంటే ఎంతో స్పెషల్. దాని ద్వారా భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోగలిగింది. దీంతో ఆ సిరీస్‌ (Series)పై ఆశలు మిగిలే ఉన్నాయి. సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను తొలి సెంచరీ చేయడం నా అదృష్టమనే భావిస్తాను.

తొలి ఇన్నింగ్స్‌ (First Innings)లో 68 రన్స్ చేసి చివర్లో అవుటయ్యాను. ఇక రెండో ఇన్నింగ్స్‌ (Second Innings)లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాను. అప్పటికే కీలకమైన వికెట్లన్నీ భారత జట్టు కోల్పోయింది. చాలా ఓవర్లతో పాటు బ్యాటింగ్ చేయాల్సిన భారం పడింది. దీంతో క్రీజు (Crease)లో పాతుకొని పోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను.

అవకాశం దొరికినప్పుడు పరుగులు రాబడుతూ ముందుకు సాగాను. ఈ క్రమంలో సెంచరీ సాధించాను. ఆ రోజు తొలి సెంచరీ సాధించడమే కాదు, తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ‘First Man of the Match Award) కూడా దక్కించుకున్నాను’ అని సచిన్ వివరించాడు. ఒకసారి మీ మొదటి సెంచరీకి వందో సెంచరీకి ఉన్న తేడా ఏమిటని సచిన్‌ని అడగ్గా, మొదటి సెంచరీ చేశాక ఇంకా 99 సెంచరీలు ఉన్న విషయం గుర్తించలేకపోయానని చెప్పినట్టు సచిన్ గుర్తుచేసుకున్నారు.



Next Story

Most Viewed