అడ్వకేట్ దంపతుల హత్యకేసులో కొత్త ట్విస్ట్..?

by  |
అడ్వకేట్ దంపతుల హత్యకేసులో కొత్త ట్విస్ట్..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల సమీపంలో హత్యకు గురైన హై కోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణీల హత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వీరిద్దరి హత్యకు రూ. 2 కోట్లు సుపారీ ఇచ్చినట్టు పోలీసు అధికారులకు ఓ లేఖ అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ లేఖలోని అంశాలపై అంతర్గతంగా విచారిస్తున్నట్టు సమాచారం. అయితే రూ.2 కోట్లు ఇచ్చిందెవరు, తీసుకున్నదెవరు అన్న వివరాలు కూడా అందులో పొందుపరిచినట్టు తెలిసింది. అయితే ఈ విషయాలన్నింటిపై పోలీస్ ఉన్నతాధికారులు సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. రూ. 2 కోట్లు సుపారీ ఇచ్చిన వ్యక్తి నేరుగా ఇచ్చాడా అకౌంట్ ట్రాన్సఫర్ చేశారా? ఇందులో పోలీసుల పాత్ర ఎంతమేర ఉంది అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed