ఓయూలో పలు అడ్మినిస్ట్రేటివ్ పదవుల భర్తీ..

1099

దిశ, సికింద్రాబాద్ : ఓయూలో ఖాళీగా ఉన్న పలు అడ్మినిస్ర్టేటివ్ పదవులను అధికారులు భర్తీ చేశారు. ఈ మేరకు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఆయా పదవుల్లో నియమితులైన అధ్యాపకులకు నియామక పత్రాలు అందజేశారు. ఓయూ పీఆర్ఓగా జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసులు నియమించారు. ఇప్పటివరకు పీఆర్ఓగా కొనసాగిన డాక్టర్ సుజాతను సివిల్ సర్వీసెస్ అకాడమీ కో-ఆర్డినేటర్‌గా నియమించారు.

ఓయూ దూర విద్యాకేంద్రం జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ వీబీ నర్సింహ్మా, ఓయూ క్యాంపస్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ వీరయ్య, సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ గణేష్, యూజీసీ హెచ్ఆర్డీసీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ విజయ, అసోసియేట్ డైరెక్టర్‌లుగా డాక్టర్ వి.సమున్నత, డాక్టర్ బి.లావణ్య, ఓయూ లేడీస్ హాస్టల్స్ డైరెక్టర్‌గా డాక్టర్ సునీత దేవీలు నియమితులయ్యారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..