ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్య‌నాథ్… శ్రీలక్ష్మికి కీలక పదవి

by  |
AP new cs, Srilakshmi IAS
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్య‌నాథ్ దాస్ నియమితులు అయ్యారు. ఈ నెల 31తో నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య‌నాథ్‌ను నూతన సీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. కాగా నీలం సాహ్నిని సీఎం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శిగా శ్యామలరావును నియమించారు.

ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి

ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆమె కీలక బాధ్యతలు నిర్వహించారు. గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీలకు మేలు చేసే విధంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఏడేండ్ల తర్వాత తెలంగాణ క్యాడర్‌లో ఆమె సెక్రటరీ ఫర్ పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ ‌గా నియమితులయ్యారు. అనంతరం ఆమె ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లాలని ప్రయత్నించింది. కానీ దానికి కేంద్రం విముఖత తెలిపింది. దీంతో తనను ఏపీకి పంపాలని క్యాట్ ముందు వాదనలు వినిపించింది. ఆమె వాదనలను క్యాట్ అంగీకరించింది. ఆ తర్వాత ఆమె తెలంగాణ నుంచి రిలీవ్ కావడం, వెంటనే ఏపీలో పోస్టింగ్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి.

Next Story