కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ.. ఏం కోరారంటే..?

by  |
కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ.. ఏం కోరారంటే..?
X

దిశ, ఆదిలాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సాహెబ్ దాదారావును ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ జిల్లాలోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు రైల్వే లైన్, తాంసి బస్టాండ్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని.. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల, సిర్పూర్, కాగజ్నగర్ లో పలు రైళ్లను ప్రతి స్టేషన్లో ఆగేలా చూడాలని మంత్రిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి తక్షణం నిధులు మంజూరు చేసి, పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఆదిలాబాద్ జిల్లా బిజెపి మోర్చా అధ్యక్షుడు గొల్ల రాజు యాదవ్, జిల్లా నాయకులు దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు రమణ ఉన్నారు.

Next Story

Most Viewed