నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం : అడిషనల్ డీసీపీ

by  |
నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం : అడిషనల్ డీసీపీ
X

దిశ, సిద్దిపేట: నేర రహిత గ్రామాలుగా చేయలనే ఉద్దేశ్యంతో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతోందని అడిషనల్ డీసీపీ రామేశ్వర్ తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్లలో అడిషనల్ డీసీపీ రామేశ్వర్ అధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిల్స్67,ఆటోలు 07 మొత్తం 74వాహనాలు సీజ్ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారని గుర్తుచేశారు.

ఈ రోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు సరైన పత్రాలు చూపించి తీసుకు పోవచ్చు అని తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కాలు అమ్ముతున్న వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని లేదా సిద్దిపేట కమిషనరేట్ వాట్స్అప్ నెంబర్ 7901100100 లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినా వెంటనే చర్యలు చేపడతామని అన్నారు.

Next Story