సీక్రెట్ గా బిడ్డను కన్న స్టార్ హీరోయిన్.. ఏడాదిగా దాస్తూ భర్తతో ఎంజాయ్

by  |

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ అభిమానులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన అమ్మడు మూడేళ్ల కింద తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా తన హావా తగ్గకుండా సోషల్ మీడియాలో భర్తతో కలిసి హల్చల్ చేస్తూ, హాట్ హాట్ ఫొటోలతో వేడి పుట్టించిన అమ్మడు ప్రస్తుతం ఒక షాకింగ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంది. పెళ్లై మూడేళ్లు అవుతున్నా పిల్లలు ఎప్పుడు అని అభిమానులు అడుగుతున్న నేపథ్యంలో శ్రీయ తాను ఎప్పుడో తల్లిని అయ్యానంటూ తెలుపుతూ తన పాపతో ఉన్న వీడియోను షేర్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గతేడాది వెకేషన్‌ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు. అక్కడే శ్రీయ ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో తన చిన్నారిని పరిచయం చేసింది. ‘2020లో ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. కరోనా కారణంగా ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్‌ వలన అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్‌ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది. అయితే ఈ విషయాన్ని ఏడాది వరకు ఎందుకు సీక్రెట్ గా ఉంచారో మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు మొదట షాక్ తిన్నా.. ఆ తర్వాత ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం శ్రీయ తెలుగులో ‘గమనం’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలలో నటిస్తోంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story