మలయాళీ హీరోయిన్‌కు మాల్‌లో వేధింపులు..

by  |
మలయాళీ హీరోయిన్‌కు మాల్‌లో వేధింపులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుంబలంగి నైట్స్’ సినిమాతో స్పెక్టాకులర్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ హీరోయిన్ అన్నాబెన్.. కొద్దికాలంలోనే సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. ‘హెలెన్, కప్పేలా’ లాంటి సినిమాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ హీరోయిన్.. మాల్‌లో వేధింపులకు గురైనట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సోదరితో కలిసి షాపింగ్ చేస్తున్న తనను ఇద్దరు వ్యక్తులు హరాజ్ చేశారని వెల్లడించింది. వారిలో ఒకడు తన వెనక నడుస్తూ బ్యాక్‌ను టచ్ చేస్తూ వెళ్లిపోయాడని, ఆ టైమ్‌లో ఏం చేయాలో తనకు అర్థం కాలేదని వాపోయింది. మళ్లీ కూరగాయలు కొనేందుకు వెళ్లినప్పుడు కూడా తమను ఫాలో అవుతూ అక్కడకు వచ్చేశారని చెప్పింది అన్నాబెన్. ‘నా దగ్గరగా వస్తూ నేను నటించిన సినిమాల గురించి అడిగారని.. కానీ ఆ టైమ్‌లోనే అమ్మ, అన్నయ్య రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని తెలిపింది.

వాళ్లు కావాలనే ఇదంతా చేసినా ఏమీ చేయలేకపోయానని.. బయటకు వచ్చిన ప్రతీసారి ఇలాంటి హరాస్‌మెంట్స్ ఎదురవుతూనే ఉన్నాయని పేర్కొంది. ‘ఈ రోజు నాకు జరిగింది.. రేపు మరో అమ్మాయికి జరుగుతుంది.. కాబట్టి నాలా చేతులు కట్టుకుని కూర్చోకుండా, మీకు ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురైతే చెంప చెల్లుమనిపించండి’ అంటూ సలహా ఇచ్చింది. ఈ రోజు నాకు లేని ధైర్యం మీకుందని నమ్ముతున్నానని తెలిపింది అన్నాబెన్.

Next Story

Most Viewed