షాకింగ్‌ న్యూస్.. ఆస్పత్రిలో చేరిన తమిళ హీరో శింబు

by  |
షాకింగ్‌ న్యూస్.. ఆస్పత్రిలో చేరిన  తమిళ హీరో శింబు
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజుల వ్యవధిలోనే సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు(శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి)ల తుది శ్వాసతో అభిమానులు ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నారు. ఇటువంటి సమయంలో తమిళ స్టార్ హీరో శింబు అనారోగ్యం పాలవడం మరింత కలవరపెడుతోంది. వైరల్ ఇన్ఫెక్షన్ సోకడంతో శింబు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్‌తో శింబు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వార్త విన్న ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Disha E-paper

Next Story

Most Viewed