ఎక్స్‌ గర్ల్ ఫ్రెండ్‌పై హీరో సెక్సువల్ అటాక్..

by  |
ఎక్స్‌ గర్ల్ ఫ్రెండ్‌పై హీరో సెక్సువల్ అటాక్..
X

దిశ, సినిమా : ‘షక లక బూమ్ బూమ్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ మధుర్ మిట్టల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. ఫిబ్రవరి 13న ముంబై, బాంద్రాలోని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన మధుర్.. తనపై దాడి చేశారని తెలుస్తోంది. డిసెంబర్ 2020లో చివరగా కలిసిన ఇద్దరు.. ఈ ఇన్సిడెంట్‌కు రెండు రోజుల ముందు మళ్లీ కలిశారని, ఇకపై తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండబోదని బాధితురాలు అదే రోజు స్పష్టం చేసిందని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.

మధుర్ ఆమె మెడపై 15 కన్నా ఎక్కువసార్లు గాయపరిచారని, జుట్టుతో లాగి కింద పడేశాడని, కుడి కన్ను మీద గాయపరిచాడని, విచక్షణా రహితంగా కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది సెక్సువల్ అటాక్ అని.. తన క్లయింట్ ముఖం, మెడ, చెస్ట్, చెవులు, కళ్లు, పక్కటెముకల్లో తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. కాగా ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఖర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story