మరణ మృదంగం ఓ వైపు..మృత్యుఘంటికలు మరో వైపు….

by  |
మరణ మృదంగం ఓ వైపు..మృత్యుఘంటికలు మరో వైపు….
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలను కరోన మహమ్మారి కలవరపెడుతోంది. వేలల్లో పేషెంట్లు వెలుగులోకి వస్తుంటే వందల సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సగటు పౌరుని జీవితం ఆందోళనకరంగా మారింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో సెకండ్ వేవ్ కబలించివేస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా మరణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనా పేషెంట్ల సంఖ్య తీవ్రంగా పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో సెకండ్ వేవ్ ప్రారంభమైన తరువాత సుమారు 25 మంది చనిపోగా, 15 వేల మంది కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలో 20 మంది మృత్యువాత పడగా, 4 వేల మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సిరిసిల్లలో 13 మంది చనిపోగా, 3 వేల మందికి పాజిటివ్ గా నిర్దారణ కాగా, పెద్దపల్లి జిల్లాలో 15 మంది చనిపోగా 3,800 మందికి వ్యాధి సోకినట్టు సమాచారం. ఫస్ట్ వెవ్ సమయంలో కూడా ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదు కాకపోగా సెకండ్ వేవ్ లో మాత్రం అడ్డు అదుపులేకుండా సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.

యువతే ఎక్కువ…
ఈ సారి కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కవ శాతం యువతే ఉన్నట్టుగా తెలుస్తోంది. 25 ఏళ్ల నుండి 39 ఏళ్ల లోపువారే ఈ సారి బాధితుల జాబితాలో సింహభాగం ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కూడా హుజురాబాద్ లో పర్యటిస్తున్న క్రమంలో ఈ విషయాన్ని ఊటంకిచడం గమనార్హం. అంతేకాకుండా ఇప్పటి వరకు కేంద్రం 45 ఏళ్ల పై బడ్డ వారికే కరోనా చికిత్స అందించాలని నిర్ణయించందని ఈ అవకాశం 24 ఏళ్లు పై బడ్డ వారందరికి కల్పించాలని మంత్రి రాజేందర్ కేంద్రాన్ని కోరారంటే రాష్ట్రంలో యువత కరోనా బారిన ఎంతమేర పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువే….
కరోనా మహమ్మారి సోకిన తరువాత ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నట్టుగా సమాచారం. లంగ్స్, లివర్, గుండె సంబందిత వ్యాధులు ప్రబలి మృత్యువు పంచన చేేరుతున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కరోనా వ్యాధి బాధితులపై ఇతరాత్ర రోగాలకు కారణమవుంతోందన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.

లాక్ డౌన్ దిశగా పల్లెలు..
మహమ్మారి విజృంభిస్తుండడంతో గ్రామాల్లో స్వీయ నిర్భందం మళ్లీ మొదలైంది. జగిత్యాల జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, కొడిమ్యాలల్లో ఇప్పటికే సెల్ఫ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

పొంతనలేని గణాంకాలు…
జిల్లా అధికార యంత్రాగం చెప్తున్న గణాంకాలకు, వాస్తవానికి పొంతన లేకుండా పోతోందని తెలుస్తోంది. ప్రజలు భయపడతారన్న కారణంగా అధికారులు గణాంకాలు తక్కువగా చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండాలంటే మాత్రం వాస్తవాలు చెప్పాలన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed