ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌కి ప్రమాదం..

by  |
Accident, MLC kavitha Convoy
X

దిశ, జగిత్యాల: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌కి ప్రమాదం చోటు చేసుకుంది. మల్యాల సమీపంలోని రాజారం శివార్లలో ఒకదానికొకటి ఐదు కార్లు ఢీ కొన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారంతా సేఫ్‌గానే ఉన్నారని అధికారులు తెలిపారు.

షార్ట్ వెపన్ స్ప్రింగ్ మిస్..

ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కవిత కొండగట్టు పర్యటనలో ఇంటలీ జెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్లూ) అధికారులను ఓ స్ప్రింగ్ పరేషాన్ చేసింది. అంజన్న సన్నిధానంలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్ వద్ద ఉన్న షార్ట్ వెపన్ స్ప్రింగ్ జారి కిందపడిపోయింది. గమనించిన అధికారులు కొండగట్టుపై గాలించారు. చివరకు స్ప్రింగ్ దొరకడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రముఖుల పర్యటనలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సెక్యూరిటీ వింగ్ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తనయ కూడా కావడంతో కవితకు స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అయితే వీరు కవిత పర్యటించే ప్రాంతాల్లోని పోలీసు అధికారులను కూడా దరి చేరనివ్వరు. వారే కంటికి రెప్పాల కాపాడుతూ ఉంటారు. అలాంటి వింగ్ పోలీస్ అధికారి వెపన్‌లోని స్ప్రింగ్ ఎలా జారిపోయిందన్నదే మిస్టరీగా మారింది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా ఇలా జరిగితే వీఐపీల సెక్యూరిటీ ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

కవిత కొత్త స్కెచ్.. ‘జై హనుమాన్‌’తో బీజేపీకి చెక్


Next Story

Most Viewed