విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. టాయిలెట్స్ క్లీనింగ్‌కు కూడా వారే..!

107

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ శివారులో గల జెఏంజె పాఠశాలలోని విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదు. అపరిశుభ్ర, నాసిరకమైన వంట సరుకులతో చేసిన ఉడికి ఉడకని, కుళ్లిపోయిన భోజనం పెట్టడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ హాస్టల్‌లో నాసిరకం బియ్యంతో అన్నం పెడుతున్నారని, వంట గది, పాత్రలు దుర్గంధ భరితంగా ఉన్నాయన్నారు.

తమ చేత బలవంతంగా వంట పాత్రలు, మరుగుదొడ్లు, బండలు కడిగించడం, గదులను శుభ్రం చేయించడం, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేయిస్తున్నారని వాపోయారు. ఇదేమిటని అడిగితే పాఠశాల నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని విద్యార్థులు నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పాఠశాల సిబ్బందిని ప్రశ్నించగా మాకు బియ్యం సరఫరా చేసిన వ్యాపారిదే బాధ్యతని తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వారు తెలపడంతో విద్యార్థులు ఆందోళన ముగించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..