ఐసీసీ నిర్ణయం.. సీఏ సమ్మతం

by  |
ఐసీసీ నిర్ణయం.. సీఏ సమ్మతం
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీ20 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది జరగాల్సిన టోర్నీని 2022కు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిర్ణయాన్ని తాము సమ్మతిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 16 జట్లను తమ దేశంలోకి తీసుకొచ్చి టోర్నీని నిర్వహించలేమని గతంలో ఐసీసీకి సీఏ లేఖ రాసింది. ఈ విషయమై పలుమార్లు ఐసీసీ సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఉన్నంతకాలం ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ రద్దుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, ఆయన లేకుండా జరిగిన తొలి సమావేశంలో టీ20 ప్రపంచకప్ రద్దుకు ఐసీసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఐసీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లే వెల్లడించారు. ‘కరోనా కారణంగా ఎన్నో క్రీడా ఈవెంట్లు రద్దవ్వడమో వాయిదా పడటమో జరిగాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20 నిర్వహించడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. మళ్లీ ఎప్పుడు నిర్వహించమంటే అప్పుడే ఏర్పాట్లు చేస్తాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లే అన్నారు.

Next Story