About Us

పార్టీకో పత్రిక, సామాజిక వర్గానికో చానెల్ అన్నట్టుగా తయారైంది తెలుగు రాష్ట్రాల మీడియా పరిస్థితి. ఒకే వాస్తవం.. ఒకే పరిణామం.. ఒకే వార్త.. ఒక్కో పేపర్ లో, ఒక్కో చానల్ లో ఒక్కోరకంగా వస్తుంది. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తేల్చుకోలేక జనం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియాతో వచ్చిన చిక్కేమిటంటే అందులో వచ్చిన సమాచారానికి విశ్వసనీయత ఉండదు. వాస్తవాలూ ఉంటాయి. పుక్కిటి పురాణాలూ ఉంటాయి. సమాచారమూ ఉంటుంది. సోదీ ఉంటుంది. అభిప్రాయాలూ ఉంటాయి. విద్వేషపు రాతలూ ఉంటాయి.

సోషల్ మీడియాకు దీటుగా అన్ని రకాల వార్తలను, సమాచారాన్ని దినపత్రికల, చానళ్ల విశ్వసనీయతతో ఎప్పటికప్పుడు తాజాగా అందించడం మా ‘దిశ’ మీడియా ప్రత్యేకత.

వాస్తవం వైపు పయనం మా నినాదం.