ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు

by  |
ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎండోమెంట్ విభాగం ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో వ్యక్తుల పేరు మీద జరిగే ఆర్జిత సేవలు, పూజలను రద్దు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయాల్లో అన్నదానం, సామూహిక పూజ, కేశ ఖండన తదితరాలు కూడా రద్దయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కమిషనర్ వెల్లడించారు. రోజువారీ జరిగే పూజలన్నీ రద్దయ్యాయని, కానీ దేవుడికి పూజారులు నిర్వహించే పూజలు మాత్రం యథావిధిగా ఉంటాయన్నారు. కోనేరులో స్నానం చేయడం, ఆలయానికి ఉచిత బస్సులను నడపడం, ఆలయం ఆధ్వర్యంలో నడిచే సత్రాల్లో, గదుల్లో వసతి సౌకర్యాలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం దగ్గర టెంట్లు, షెడ్లు వేయడం, కల్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటివన్నీ రద్దయినట్లేనన్నారు. ఇప్పటికే ఆర్జితసేవలు, గదుల రిజర్వేషన్, వివాహాలు తదితరాలన్నింటికి తీసుకున్న రుసుమును తిరిగి చెల్లించనున్నట్లు వివరించారు. జనం గుమికూడరాదన్న ఉద్దేశంతోనే ఆలయాల్లో ఇలాంటి ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

tag: Telangana, Endowment, Temples, Pujas, Cancelled, Commissioner

Next Story

Most Viewed