వ్యాక్సిన్‌ తీసుకోలేదు.. కానీ, సర్టిఫికెట్ వచ్చింది ఎలా..?

by  |
Minister KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో విచిత్ర ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మొదట్లో వ్యాక్సిన్ కోసం బారులు తీరినప్పటికీ, సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇంటికే వచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే, కరీంనగర్ జిల్లా యువకుడు కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోకపోయినా, వ్యాక్సిన్ పూర్తయినట్లు మెసేజ్ రావడంతో అవాక్కయ్యారు. సెకండ్ డోస్ కోసం వెళ్లకపోయినా ఇలా ఎందుకు మెసేజ్‌తో పాటు సర్టిఫికెట్ వచ్చిందో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్‌‌కు ట్వీట్ చేశారు. సాయినాథ్ అనే యువకుడు తనకు వచ్చిన వ్యాక్సినేషన్ మెసేజ్ పై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ తో పాటు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కు ట్వీట్ వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఇలా వ్యాక్సినేషన్ జరగకపోయినా మెసేజ్‌లు రావడం కొత్తేమీ కాదు. వ్యాక్సినేషన్ స్లాట్ రిజిస్ట్రేషన్ లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో వ్యాక్సిన్ వేసుకోకున్నా.. వేసుకున్నట్లే వచ్చాయి. ఇలా వ్యాక్సినేషన్‌కి సంబంధించిన మెసేజ్‌లు సర్టిఫికెట్లు రావడంతో.. ప్రజలు వ్యాక్సిన్ పొందలేకపోతున్నారు. మొబైల్ నెంబర్ ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్న క్రమంలో నిజంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నా.. వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు.


Next Story

Most Viewed