కరెంట్ పోవడంతో జనరేటర్ ఆన్ చేద్దామని వెళ్ళగా.. ఇంతలోనే సడన్‌గా

53
snakebite

దిశ, వర్గల్: పాముకాటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం అనంతగిరి పల్లి గ్రామానికి చెందిన కర్రె లచ్చయ్య, సుశీల దంపతుల చిన్న కొడుకు మహేష్ (27) గత కొంత కాలంగా నాచారంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తునాడు. గురువారం డ్యూటీ లో ఉండగా కరెంట్ పోవడంతో జనరేటర్ ఆన్ చేద్దామని వెళ్ళాడు. అప్పటికే అందులో ఉన్న పాము బటన్ నొక్కుతున్న మహేష్ చేతిని కాటేసింది. పెట్రోల్ బంక్ మేనేజర్ వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మహేష్ అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య మౌనిక, సంవత్సరం కొడుకు సోమేశ్ ఉన్నారు. పండగ వేళ డ్యూటీ కి వెళ్ళొస్తానని తిరిగి రాని లోకాలకు వెళ్లవా అంటూ కుటుంబ సభ్యులు దుఃఖం అక్కడున్న వారిని కలిచివేసింది.